ఇంతకీ ఈ లుక్ లో ఉన్నదెవరు..?

ఇంతకీ ఈ లుక్ లో ఉన్నదెవరు..?

చెర్రీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంగస్థలం’. ఈ చిత్రానికి ట్యాగ్ లైన్ ‘1985’. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో గతంలో ఎప్పుడు కనిపించని విధంగా చెర్రీ ఓ డిఫరెంట్ లుక్ లో అలరించనున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కంప్లీట్ గా ఈ సినిమా అంతా పల్లెటూరు వాతావరణంలో తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కీ రోల్ లో నటిస్తోంది. ఆమె ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాళ్లకు గజ్జెలు, కాలి వేలుకు మెట్టెలు పెట్టుకున్న ఓ అమ్మాయి.. పక్కన ఓ కుండ.. ఇదీ ఈ లుక్ కనిపిస్తున్న వైనం. ‘నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్దమైతే నవ్వేసి ఊరుకో.. ‘ అని టాగ్ చేస్తూ ఈ లుక్ ని అనసూయ షేర్ చేసింది.

leave a comment

Create AccountLog In Your Account