ఇద్దరి మధ్య  కెమిస్ట్రీ అదిరింది..!

ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో పవన్-కీర్తి సురేష్ కలిసి ఉన్న ఓ స్టిల్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. మూవీ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ ఈ లుక్ ని విడుదల చేయడం గమనార్హం.

పవన్ సరసన కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ ఆడిపాడనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుథ్ మ్యూజిక్ అందించారు. హారిక అండ్ హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మూవీని నిర్మిస్తున్నారు. మూవీ టైటిల్ కింద ఇప్పటకే చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందట. ఇక ఈ స్టిల్ ని వీక్షించిన వారంతా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది అంటున్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account