ఎన్టీఆర్ ‘కుశ’ ఫస్ట్ లుక్ రిలీజ్..

ఎన్టీఆర్ ‘కుశ’ ఫస్ట్ లుక్ రిలీజ్..

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న మూవీ ‘జై లవ కుశ’. ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. జై, లవ, కుశ అనే పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ ముందే చెప్పినట్లుగా అభిమానులకు వినాయక చవితి సందర్భంగా గిఫ్ట్ ఇచ్చేసింది. సినిమాలో మూడో పాత్ర ‘కుశ’కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్‌ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

 

ఇప్పటికే విడుదల చేసిన జై ఫస్ట్ లుక్ లో విలన్ లుక్స్ కనిపిస్తున్నాయి. లవ కుమార్ గుడ్ బాయ్ లా కనిపిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన కుశ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ ఫుల్ ట్రెండీగా కనిపిస్తున్నారు. ఈ మూడు లుక్స్ కి కూడా ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లులుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 21న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account