ఓవర్సీస్ లో సెకెండ్ బిగ్గెస్ట్ రిలీజ్ ‘స్పైడర్’..?

ఓవర్సీస్ లో సెకెండ్ బిగ్గెస్ట్ రిలీజ్ ‘స్పైడర్’..?

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. రూ.150 కోట్లతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.టాలీవుడ్ లో మహేష్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకు మురగదాస్ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత భారీగా నెలకొన్నాయి.

రీసెంట్ గా తమిళ్ లో నిర్వహించిన ఆడియో ఫంక్షన్ తో మహేష్ బాబు కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. దీనికి తోడు డైరెక్టర్ మురగదాస్ తమిళ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ డైరెక్టర్. దీంతో అక్కడ కూడా సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Scott Men’s Basic Cotton Round Neck Half Sleeve Solid T-shirts – Pack of 3

ఇక ఈ మూవీని ఓవర్సీస్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ ఏకంగా 400 లొకేషన్స్ లో మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇదే ఓవర్సీస్ లో సెకెండ్ బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. లోకల్ గా తెలుగు వెర్షన్ ని 600 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే తమిళ్ వెర్షన్ ని 150 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఈ మూవీ సెప్టెంబరు 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఓ రోజు ముందుగా రాత్రి ప్రీమియర్స్ తో షో ప్రారంభం కానుంది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘స్పైడర్’ అన్నిచోట్ల సూపర్ హిట్ అవుతుందని మహేష్ నమ్మకంతో ఉన్నాడు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account