‘ జై ల‌వ‌కుశ‌ ‘ మూవీ రివ్వ్యూ..   Video

‘ జై ల‌వ‌కుశ‌ ‘ మూవీ రివ్వ్యూ.. Video

మూవీ: జై ల‌వ‌కుశ‌
యాక్టర్స్: ఎన్టీఆర్‌, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, సాయికుమార్‌, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్‌
కెమెరా: చోటా కె.నాయుడు
ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు
ప్రొడ్యూసర్స్: క‌ల్యాణ్‌రామ్‌, హ‌రికృష్ణ‌
ర‌చ‌న‌: బాబి, కోన వెంక‌ట్‌, కె.చ‌క్ర‌వ‌ర్తి
డైరెక్షన్: కె.ఎస్‌. ర‌వీంద్ర‌ (బాబి)
బ్యానర్‌: ఎన్టీఆర్ ఆర్ట్స్‌

 

ఎన్టీఆర్ అంటే పక్కా మాస్ హీరో.. ఇక డ్యాన్సులు విషయంలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అంతేకాకుండా.. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ వంటి వరుస హిట్స్ సొంతం చేసుకున్నాడు. ఇలాంటి టైమ్ లో జై లవకుశ చిత్రంలో త్రిపాత్రాభినయం చేశాడు. జై క్యారెక్టర్ లో ప్రతినాయకుడిగా నటించాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్స్, టీజర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ఎలా నటించాడు అన్నది ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూశారు. ఇవాళ రిలీజ్ అయిన జై లవకుశ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.. జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడా.. ఓ సారి పరిశీలిద్ధాం..

స్టోరీ: రామచంద్రాపురం అనే కుగ్రామంలో చిత్ర కథ ఆరంభమవుతుంది. జై లవ కుశ అనే ముగ్గురు కవల పిల్లలు. వీరిలో జై పెద్దవాడు.. నత్తి ఉంటుంది. ఇక వీరి మామాయ్య అయిన పోసాని నాటకాలు వేస్తూంటాడు. ఆయన వేసే రామాయణం నాటకంలో జైకి ఛాన్స్ ఇవ్వడు. లవ కుశలను మాత్రమే ఆదరిస్తాడు. ఇది జైకి తీవ్ర మనస్థాపం కలిగిస్తుంది. అతనిలో డిప్రెషన్ పెరిగిపోతుంది. దీంతో తమ్ముళ్ళను చంపాలని భావిస్తాడు. నాటకం వేస్తున్న ప్లేస్ ని పేల్చేస్తాడు. ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. కట్ చేస్తే జై విలన్ గా మారిపోతాడు. రావణుడిని ఆరాధిస్తూ రావణ్ మహరాజ్ లా మారిపోతాడు. ఇక లవ బ్యాంక్ ఆఫీసర్ అవుతాడు. చివరి వాడు అయిన కుశుడు దొంగలా మారిపోతాడు.

లవకుమార్ అమాయకుడు, మంచివాడు, అతన్ని మోసం చేసి లోన్స్ తీసుకున్న వారు తిరిగి కట్టడం అంటూ ఉండదు. దీంతో అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. చివరి వాడైన కుశుడు దొంగతనాలు చేసి బాగా సంపాదిస్తాడు. ఆ డబ్బును మార్చుకోవడానికి లవ ప్లేస్ లో బ్యాంక్ లోకి వెళ్ళి మార్చుకోవాలని ట్రై చేస్తాడు. రికవరీ డబ్బుతో లవ కుమార్ కి చెప్పకుండా పారిపోతాడు. దీనివల్ల లవ కుమార్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇదిలాఉంటే జై తన తమ్ముళ్లను కిడ్నాప్ చేస్తాడు. అసలు జై తన తమ్ముళ్ళను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు..? రావణుడిగా జై ఎందుకు మారిపోతాడు..? ముగ్గురు అన్నదమ్ములు చివరకు కలుస్తారా..? వంటివి తెరమీద చూస్తేనే బాగుంటుంది.

విశ్లేషణ:

జై లవకుశలో ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది జై క్యారెక్టర్ ని. రావణుడిలా ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేశాడు. ఆ పాత్రను ఆకళింపు చేసుకుని నటించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు. ఇలాంటి నటన కేవలం ఎన్టీఆర్ మాత్రమే చేయగలడేమో అనిపిస్తుంది. జై క్యారెక్టర్ లో తన నటనను ఎన్టీఆర్ పీక్ స్టేజ్ లో చూపించాడు. అలాగే లవ, కుశ పాత్రల్లో కూడా బాగా నటించాడు. నెమ్మదస్థుడిగా లవ కుమార్ పాత్రలో మెప్పించాడు. అలాగే దొంగ క్యారెక్టర్ లో కనిపించి కామెడీతో పాటు నటనతో అలరిస్తాడు. డ్యాన్సుల విషయంలో ఎన్టీఆర్ పెట్టింది పేరు. ప్రేక్షకులు ఆశించిన రీతిలో ఎన్టీఆర్ డ్యాన్సులు చేసి చూపించాడు.
జై క్యారెక్టర్ సీరియస్ గా ఉంటే, లవ, కుశ పాత్రల్లో కామెడీ ఉంటుంది. కుశుడు అన్నలను మోసం చేసి జంప్ అయిపోవాలని చూడటం.. దొరికిపోయినప్పుడు చేసే కామెడీ బాగుంటాయి. ఎమోషన్స్, సెంటిమెంట్స్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. చివరిలో తన తమ్ముళ్ళను క్షమించమని ప్రాధేయపడటం , అలాగే తమ్ముళ్ళను క్షమించమని పోసాని అడగడం ఆకట్టుకుంటుంది.

హీరోయిన్స్ విషయానికొస్తే నివేధా థామస్, రాశిఖన్నాలకు పెద్దగా నటనకు అవకాశం చిక్కలేదు. కేవలం పాటలకు మాత్రమే అన్నట్లుగా వారి పాత్రలు ఉంటాయి. సాయికుమార్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, రోనిత్ రాయ్‌, అభిమ‌న్యుసింగ్ తమ తమ పాత్రలకు న్యాయం చేస్తారు. దర్శకకుడు కథను, మాటలను చక్కగా చూపించాడు. రైతుల మీద ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌, అన్న‌ను తమ్ముళ్లు ప్రాధేయ‌ప‌డే స‌న్నివేశాల్లో డైలాగ్స్ , సంభాషనలు అలరిస్తాయి. చోటా కె నాయుడు కెమెరా పనితనం బాగుంటుంది. కాకాపోతే కథ మాత్రం అందరికి తెలిసినదే కావడం గమనార్హం. సెకాండాఫ్ లో కాస్తంత టెంపో లోటు కనిపిస్తుంది. అది తప్పించి మిగిలిన కథ అంతా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఎన్టీఆర్ నటనే సినిమాలో కీలకం అని చెప్పొచ్చు.

ప్ల‌స్ పాయింట్స్:
ఎన్టీఆర్ నటన, డ్యాన్సులు
పతాక సన్నివేశాలు
మ్యూజిక్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్:
క‌థ‌ అందరికి తెలిసిందే
ద్వితీయార్థంలో కాస్తా టెంపో మిస్ కావడం

బోటమ్ లైన్: జై.. జై.. లవ కుశ .. జై రావణ్ మహరాజ్..
రేటింగ్ : 3.25/5

leave a comment

Create AccountLog In Your Account