టాలీవుడ్ గ్రీకు వీరుడు అక్కినేని నాగార్జునకు బర్త్ డే విషెస్..!

టాలీవుడ్ గ్రీకు వీరుడు అక్కినేని నాగార్జునకు బర్త్ డే విషెస్..!

టాలీవుడ్ గ్రీకు వీరుడు అక్కినేని నాగార్జున మంగళవారం బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన 57వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన మొదటి చిత్రం విక్రమ్ కాగా.. ఇటీవలె నటించిన చిత్రం ఓం నమో వేంకటేశాయి. ప్రస్తుతం ఆయన ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది 2’లో లీడ్ రోల్ లో నటిస్తున్నారు.

అక్కినేని నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

*మా ఎవర్‌గ్రీన్‌ గ్రీకువీరుడు, ఏ పాత్రనైనా చేయగల ‘ఘరానా బుల్లోడు’,అందరినీ మెప్పించల ‘రామదాసు’ నాగార్జునకి బర్త్ డే విషెస్ – దర్శకుడు కె.రాఘవేంద్రరావు
*అక్కినేని నట వంశోద్ధారకుడు, నట మన్మథుడు, స్నేహశీలి, అక్కినేని నాగార్జునకి జన్మదిన శుభాకాంక్షలు – పరుచూరి గోపాలకృష్ణ
*హ్యాపీ బర్త్‌డే నాగార్జున – కొరటాల శివ
*నాగార్జున గారికి బర్డ్ డే విషెస్ – బోయపాటి శ్రీను
*హ్యాపీబర్త్‌డే నాగార్జున. మీరెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా – వంశీ పైడిపల్లి
*అక్కినేని నాగార్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలు – దిల్‌రాజు
*హ్యాపీ బర్త్‌డే చిన్నమామయ్య – సుమంత్‌
*చిన్నమామయ్యకి బర్త్ డే విషెస్. మీరెప్పుడూ నాకు తోడుగా ఉన్నారు అందుకు మీకు ధన్యవాదాలు – సుశాంత్‌
*హ్యాపీ బర్త్‌డే నాగార్జున. నువ్వు ఎప్పటికి ఇలాగే యవ్వనంగా, ఆనందంగా ఉండాలి. ఇంకా చాలా విజయాలు అందుకోవాలి – వెంకటేశ్‌
*నాగార్జున గారికి బర్త్ డే విషెస్. మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి – నారా లోకేశ్‌
*ఎవర్‌గ్రీన్‌ నాగార్జునకి పుట్టిన రోజు శుభాకాంక్షలు – రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

leave a comment

Create AccountLog In Your Account