డేర్ అండ్ డాషింగ్ లేడీగా శ్రద్ధా కపూర్..?

డేర్ అండ్ డాషింగ్ లేడీగా శ్రద్ధా కపూర్..?

‘బాహుబలి’ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్ నటిస్తోంది. జాతీయ స్థాయిలో రూపొందుతున్న మూవీ కాబట్టి పలువురు బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నారు. అయితే శ్రద్ధా కపూర్ డ్యూయల్ రోల్ చేస్తోందని టాక్.

వీటిలో ఓ క్యారెక్టర్ లో తెలుగుమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఈ క్యారెక్టర్ లో ఆమె చాలా అమాయకంగా కనిపించనున్నారట. మరో క్యారెక్టర్ లో డేర్ అండ్ డాషింగ్ లేడీగా నటిస్తున్నారట. అలాగే యాక్షన్ సన్నివేశాలను కూడా పెడుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

‘సాహో’ మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పించి రీలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసేందుకు అనుగుణంగా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account