త్వరలో రజనీని మహేష్ దాటేస్తాడా..?

త్వరలో రజనీని మహేష్ దాటేస్తాడా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ రికార్డ్ బ్రేక్ చేసేందుకు పెద్ద సమయం పట్టేటట్లు లేదు. సీనియర్ యాక్టర్ రికార్డ్ ని మహేష్ బ్రేక్ చేయడానికి ట్రై చేయడమేంటి అనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. రీసెంట్ గా మహేష్ ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్లకు చేరింది. ఇప్పటికే ప్రిన్స్ టాలీవుడ్ లో ఈ విషయంలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక రజనీకాంత్ 4.18 మిలియన్ల ఫాలోవర్లతో ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నట్లే కదా..!

తమిళ్ హీరో ధనుష్ అత్యధికంగా 5.7 మిలియన్లతో టాప్ లో ఉంటే నెక్ట్స్ పొజిషన్ లో రజనీకాంత్ ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్ లోకి మహేష్ వచ్చేశాడు. వాస్తవానికి మహేష్ ట్విట్టర్ లోకి అడుగుపెట్టి సుమారుగా ఏడేళ్ళు అవుతుంది. అయితే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ విషయాలు పంచుకోవడం మినహా ఈ హీరో సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ కాదు. అయినా నాలుగు మిలియన్లకు చేరడం గ్రేట్ కదా.

మురుగదాస్ కాంబినేషన్ లో ‘స్పైడర్’ మూవీతో మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో అక్కడ కూడా ఈ హీరోకి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉందని ఆడియో ఫంక్షన్ లో తెలిసిపోయింది.ఏదైతేనేం మహేష్ ని ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య భారీగా పెరుగుతోంది. త్వరలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ని దాటేసే అవకాశాలున్నాయని అభిమానులు ఆశక్తిగా చర్చించుకుంటున్నారు.

మరో టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ రీసెంట్ గా 2 మిలియన్ల మైలు రాయిని చేరుకున్నారు. పవన్ కూడా సోషల్ మీడియాలో సినిమాపరంగా పెద్ద యాక్టివ్ కాదు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ప్రశ్నించడానికి, తన భావాలను వెల్లడించడానికి ఆయన ట్విట్టర్ ని వేదికగా చేసుకుంటున్నారు. ఓవరాల్ గా సౌత్ ఇండియాలో సమంత-4.61 మిలియన్లు.. త్రిష-3.98 మిలియన్లు.. రానా-3.66 మిలియన్లు.. ఎస్ఎస్ రాజమౌళి-3.59 మిలియన్లు..అక్కినేని నాగార్జున-3.41 మిలియన్లతో ఉన్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account