దుమ్ములేపుతున్న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ ట్రైలర్.. Video

దుమ్ములేపుతున్న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ ట్రైలర్.. Video

నందమూరి తారక రామారావు నటించిన మూవీ ‘జై లవ కుశ’. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. జై, లవ, కుశ క్యారెక్టర్స్ లో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఈ మూడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, టీజర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒక్కో క్యారెక్టర్ లో ఒక్కో రకమైన గెటప్, బాడీ లాంగ్వేజ్ తో ఎన్టీఆర్ ఇరగదీశారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ‘ఏ తల్లికైనా ముగ్గురు పిల్లలు పుడితే రామ, లక్ష్మణ, భరతులు అవ్వాలని కోరుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ, రామ, లక్ష్మణులు అయ్యారు’ అంటూ ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘నేను మహానటుడ్ని అని ఆడియన్స్‌లో పాజిటీవ్‌ రియాక్షన్‌ ఉంది రా. అలాంటి నన్ను మీ ఎదవ పర్ఫామెన్స్‌లు వేసి ఆడిటర్స్‌ ముందు ఇరికించేస్తారా.. రా?’ అంటూ లవ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఫైనల్ గా ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’అంటూ జై చెప్పిన డైలాగ్ అదిరిపోతోంది. జై క్యారెక్టర్ లో బాడీ లాంగ్వేజ్. హావభావాలు, నత్తిగా మాట్లాడటం.. ఇవన్నీ చూస్తూంటే ఈ క్యారెక్టర్ హైలెట్ అవుతుందని అనుకోవచ్చు.

ప్రముఖ దర్శకుడు బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబరు 21న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా ట్రైలర్ తో మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.

 

Related Posts

leave a comment

Create AccountLog In Your Account