నాయికలతో ‘జై లవ కుశ’

నాయికలతో ‘జై లవ కుశ’

ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జై లవకుశ’. ఈ మూవీ సెప్టెంబర్ 21న థియేటర్స్ లోకి రానుంది. ఇక ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఒకేసారి తెరపై ముగ్గురు ఎన్టీఆర్ లు సందడి చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మరో మూడు రోజుల్లో సినిమా చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ముగ్గురు ఎన్టీఆర్ లు తమ తమ హీరోయిన్లతో ఉన్న స్టిల్స్ ని రిలీజ్ చేసింది.

ఈ స్టిల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. వీటిని చూసిన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మూడు క్యారెక్టర్లలో అందరిని ‘జై’ క్యారెక్టర్ ఆకట్టుకుంటోంది. నత్తి నత్తిగా మాట్లాడుతూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది అని ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌, రాశీఖన్నా, నివేదా థామస్‌ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని బాబి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదలవుతోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని ఫస్ట్ లుక్స్, టీజర్స్, ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

leave a comment

Create AccountLog In Your Account