పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ మూవీకి ఓవర్సీస్ రైట్స్ రేటు తెలుసా..?

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ మూవీకి ఓవర్సీస్ రైట్స్ రేటు తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది. త్వరలో ఓవర్సీస్ కు కూడా షూటింగ్ నిమిత్తం వెళ్లనున్నారు. ఇదిలాఉంటే ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ భారీ ధర పలికాయని టాక్. అసలే పవర్ స్టార్ నటిస్తున్న చిత్రం. ఫుల్ రేంజ్ లో ధర పలుకుంది. దీనికి తోడు త్రివిక్రమ్ కూడా తోడవ్వడంతో ఇది ఇంకాస్తా పెరిగిందని ఫిల్మ్ నగర్ సమాచారం.

ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ని నిర్మాతలు 21 కోట్లకు అమ్ముతున్నారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం సాగుతోంది. బ్లూ స్కై సంస్థ వారు 19 కోట్లకు బేరం మాడారట. కాని నిర్మాతలు నో చెప్పారట. దీంతో 20 కోట్లు అవుట్ రేట్ మరో కోటి రికవరబుల్ గా ఇచ్చేందుకు రెడీ అయ్యారని టాక్. దీనికి నిర్మాతలు కూడా సానుకూలంగా స్పందించారని ప్రచారం సాగుతోంది. పవర్ స్టార్ సినిమానా మజాకా అంటూ ఫిల్మ్ నగర్ జనాలు చర్చించుకుంటున్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account