పాండ్యాతో డేటింగ్ లో లేను: పరిణీతి చోప్రా

పాండ్యాతో డేటింగ్ లో లేను: పరిణీతి చోప్రా

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా-టీమిండియా క్రికెటర్ హర్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నారంటూ ముమ్మర ప్రచారం సాగుతోంది. ఇదికాస్తా వైరల్ కావడంతో ఈ ముద్దుగుమ్మ స్పందించింది. తనకు పాండ్యాకు మధ్య ఏం లేదని క్లారిటి ఇచ్చింది. డేటింగ్ ఏమీ చేయడం లేదని కన్ఫర్మ్ చేసేసింది. అయితే గతంలో పరిణీతి ఓ ట్వీట్ లో ఓ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చింది.

‘ ఓ మంచి పార్టనర్‌ తో మంచి ట్రిప్‌. లవ్‌ ఈజ్‌ ఇన్‌ ద ఎయిర్‌’ అంటూ ట్వీట్‌ చేసింది. దీనికి పాండ్యా రెస్పాండ్ అయ్యాడు. ‘అది ఎవరో నేను చెప్పనా.. ? అని ప్రశ్నించాడు. అలాగే..  మరో బాలీవుడ్‌, క్రికెటర్ ల మధ్య  లింక్‌ అనుకుంటా’ అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి పరిణీతి తిరిగి రెస్పాండ్ అయింది. ‘కాదు కాదు తన పార్ట్‌నర్‌ సైకిలే’ అంటూ పేర్కొంది. వీరి ట్వీట్స్ ను గమనించిన నెటిజన్లు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేసుకున్నారు. దీంతో వీరి డేటింగ్ పై ప్రచారం షూరూ అయిపోయింది. దీంతో ఈ అందాల తార రెస్పాండ్ అయి డేటింగ్ లాంటిదేమీ లేదని తేల్చేసింది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account