పీఎస్‌పీకే 25వ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆన్‌ 2 సెప్టెంబర్‌

పీఎస్‌పీకే 25వ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆన్‌ 2 సెప్టెంబర్‌

పవన్‌కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ సరసన కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సినిమా ఫస్ట్‌లుక్‌ ని సెప్టెంబర్‌ 2న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను అభిమానులతో చిత్ర యూనిట్ పంచుకుంది. ‘పీఎస్‌పీకే 25వ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆన్‌ 2 సెప్టెంబర్‌’ అని కేవలం కళ్లజోడు మాత్రమే కనిపిస్తున్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఎస్‌.రాధ కృష్ణ నిర్మిస్తున్నారు. ప్రముక సంగీత దర్శకుడు అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీకి ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేదీ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account