పూజా హెగ్డే పెళ్ళి అలా చేసుకుంటుందట..?

పూజా హెగ్డే పెళ్ళి అలా చేసుకుంటుందట..?

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ ‘ముగమూడి’ అనే తమిళ చిత్రంతో తెరగేట్రం చేసింది. ఈమె ‘మిస్ యూనివర్స్ ఇండియా 2010’ రన్నరప్ గా నిలిచింది. తర్వాత టాలీవుడ్ లో ‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘డీజే’ చిత్రంతో అయితే బాగా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘మొహంజదారో’ చిత్రంలో కూడా మెరిసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రంలో కూడా లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

రీసెంట్ ఈ ముద్దుగుమ్మ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకునేది లేదని స్పష్టం చేసేసింది. ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ మీద పెట్టినట్లుగా తెలిపింది. అయితే ఫ్యూచర్ లో తన పెళ్ళి మాత్రం ఫారెన్ లోనే జరుగుతుందని తేల్చేసింది. ఘనంగా పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పింది. కావాల్సిన వారిని కొద్దిమందిని మాత్రమే పెళ్లికి పిలుస్తానని నిర్మోహమాటంగా చెప్పేసింది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account