‘పైసా వసూల్’ మూవీ రివ్వ్యూ

‘పైసా వసూల్’ మూవీ రివ్వ్యూ

బ్యాన‌ర్: భ‌వ్య క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియాశ‌ర‌న్‌, ముస్కాన్‌, కైరా ద‌త్‌, పృథ్వీరాజ్‌, అలీ, క‌బీర్ బేడి, విక్ర‌మ్ జీత్‌
మ్యూజిక్: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్‌.జి
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడ్యూసర్: వి.ఆనంద ప్ర‌సాద్‌
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌

నందమూరి అందగాడు బాలకృష్ణ ఫుల్ జోష్ మీదున్నారు. ఈ ఏడాది ‘గౌతమి పుత్ర శాతకర్ణి’తో బంపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్టర్ గా సినిమా అనౌన్స్ చేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలే బాలయ్య అంటే ఫుల్ మాస్ హీరో. ఆయనకు మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తోడవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక టీజర్ రిలీజ్ అయిన తర్వాత అందులో బాలయ్య సరికొత్త బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలీవరీతో అదరగొట్టేశారు. దీంతో సినిమాపై అంచానాలు పీక్ స్టేజ్ కి చేరాయి. బాలకృష్ణ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో పూరీ జగన్నాథ్ కూడా తెగకష్టపడ్డారని టాక్. అలాగే నందమూరి అందగాడు కూడా సరికొత్త కథ అని చెప్పడంతో అందరి చూపు ‘పైసా వసూల్’ పై పడింది. మరి ఇవాళ విడుదలైన ‘పైసా వసూల్’ తో అటు బాలయ్య.. ఇటు పూరీ జగన్నాథ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారా..? సినిమా ఎలా ఉంది..? ఓ సారి పరిశీలిద్దాం..

స్టోరీ:

తేడా సింగ్( బాలకృష్ణ) తీహార్ జైలు నుంచి వస్తాడు. ఎవరికి భయపడే రకం కాదు. ఎవరినైనా ఎదిరించగలిగే సత్తా ఉన్నవాడు. మరోవైపు బాబ్ మార్లే ( విక్రమ్ జీత్) పెద్ద మాఫియా డాన్. అతను పోర్చుగల్ లో ఉంటాడు. అతని తమ్ముడుని భారత్ రా ఆఫీస్ చంపేస్తాడు. ఈ నేపథ్యంలో బాబ్ మార్లే భారత్ లో విధ్వంసాలు సృష్టించాలని డిసైడ్ అవుతాడు. అతనికి భారత్ లో ఓ మంత్రి సహా కొందరు స్థానిక మాఫియా సపోర్ట్ చేస్తుంది. వారి సాయంతో హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ లు చేస్తాడు. ఈ బ్లాస్ట్స్ లో చాలామంది చనిపోతారు. తన తమ్ముడిని చంపిన పోలీసుల్ని టార్గెట్ గా చేసుకుని చంపేస్తూంటారు.

బాబ్ మార్లే కోసం భారత్ పోలీసులు వెతుకుతూ ఉంటారు. కాని అతన్ని పట్టుకోవడానికి స్థానిక చట్టాలు అడ్డుపడుతూంటాయి. దీంతో ఓ గ్యాంగ్ స్టర్ ను వాడుకుని ఈ మాఫియాను అంతమొందించాలని రా ఆఫీసర్ కబీర్ బేడి ప్లాన్ చేస్తాడు. ఇందులో భాగంగా తేడా సింగ్( బాలకృష్ణ)తో మాట్లాడుకుంటారు.ఈ తేడా సింగ్.. హారిక ( ముస్కాన్) వెనుక పడుతూంటాడు. ఆమె మాత్రం తన అక్క సారిక(శ్రియ) కోసం వెతుకుతూ ఉంటుంది. సారిక పోర్చుగల్ లో మిస్ అవుతుంది. హారిక తన అక్కను వెతికే సమయంలో.. తేడాసింగ్-సారిక మధ్య రిలేషన్ గురించి తెలుసుకుంటుంది. అసలు ఆ రిలేషన్ ఏంటి..? సారిక ఎలా మిస్ అవుతుంది..? తేడా సింగ్ మాఫియా డాన్ ని అంతమొందిస్తాడా..? వంటి విషయాలను తెర మీద చూస్తేనే బాగుంటుంది.

విశ్లేషణ:

బాలయ్య అనగానే ఆయన మాసిజం, క్లాసిజం రెండూ కనిపిస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో మెప్పించడంలో బాలయ్య దిట్ట. అలాంటి యాక్టర్ కి పూరీ జగన్నాథ్ తోడయ్యాడు. డౌట్ లేకుండా ఓ విషయం చెప్చొచ్చు. ఇప్పటివరకు బాలయ్య చేసిన చిత్రాలు వేరు.. ఈ చిత్రం వేరు.. ఈ మూవీలో బాలయ్య ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు. మాస్ డైలాగ్స్, యాక్షన్ అనేది బాలయ్యకు అలవాటే. అయినా సరికొత్తగా ఈ చిత్రంలో ఆ సన్నివేశాల్లో నటించారు. ఇక బాలయ్య చెప్పిన డైలాగ్స్ అదరహో అనిపిస్తాయి. ఉదాహరణకి.. బీహార్‌లో తాగించిన‌వాడిని తీహార్‌లో పోయించా తూ క్యారే అవులే.. న‌న్ను ఇక్కడ కాల్చాలంటే నా అభిమానులైనా అయి ఉండాలి, నా బంధువులైనా అయి ఉండాలి.. సింహానికి మేకని ఎరగా వేయాల‌నుకోవ‌డం క‌ర‌క్టే కానీ ఆ ప్లాన్ ని మేక‌ల‌న్నీ క‌లిపి చేయ‌డ‌మే ఫన్నీగా ఉంది. ఇలాంటి డైలాగ్స్ కి థియేటర్ హోరెత్తిపోవడం ఖాయం అని చెప్పొచ్చు. సినిమా చివరిలో బాలయ్య దేశభక్తి గురించి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అసలు ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ బాలయ్యే అని చెప్పొచ్చు.

రా ఏజెంట్ గా బాలయ్యను దర్శకుడు చూపించిన తీరు మాత్రం పూరి జగన్నాథ్ చేసిన గత చిత్రాలను గుర్తుకుతెస్తాయి. కామెడీ కూడా ఇంకాస్తా ఎక్కువగా పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలీ పాత్ర పెద్దగా కామెడీ పండించలేదు. కబీర్ బేడీ తన పాత్రకు న్యాయం చేశారు. హీరోయిన్లు వారికి అప్పగించిన పాత్రలకు న్యాయం చేశారు. శ్రియ పాత్రే ప్రధానం. ఆమె తన పాత్రకు తగిన విధంగా న్యాయం చేసింది. కైరా దత్‌ ఐటమ్‌ సాంగ్‌ తో ఆకట్టుకుంటుంది. అయితే కొందరు నటులు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. పాటల విషయానికి వస్తే అన్ని సాంగ్స్ బాగానే ఉంటాయి. ముఖ్యంగా ‘పైసా వసూల్..’, ‘మామా ఏక్‌ పెగ్‌లా..’ బాగుంటాయి. ఎడిటింగ్ బాగుంటుంది. కెమెరామెన్ తన పనితనం చూపించారని చెప్పొచ్చు. కథలో కొత్తదనం కనిపించదు. పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని బాలయ్య ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దినట్లుగా అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా మొత్తానికి నందమూరి బాలకృష్ణదే మెయిన్ క్యారెక్టర్ . సినిమా మొత్తం ఆయన మీద ఆధారపడే నడుస్తుంది.

ప్ల‌స్ పాయింట్స్

– బాల‌కృష్ణ యాక్టింగ్
– బాలకృష్ణ చెప్పే డైలాగ్స్‌
– సినిమాటోగ్ర‌ఫీ
– ఎడిటింగ్
– రెండు, మూడు మంచి పాటలు

మైన‌స్ పాయింట్స్

– మ్యూజిక్ కాస్త డల్ అనిపిస్తుంది.
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యావరేజ్
– పూరీ జగన్నాథ్ చేసిన గత చిత్రాలను గుర్తుకు తెస్తుంది.

బోటమ్ లైన్: మాస్ ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘పైసా వసూల్’

రేటింగ్: 3.25/5

 

leave a comment

Create AccountLog In Your Account