ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన గౌతమి..

ఫేక్ న్యూస్ పై ఫైర్ అయిన గౌతమి..

ప్రముఖ నటీమణి గౌతమి.. కమల్ హాసన్ తో సహజీవనం చేసిన విషయం తెలిసిందే. వీరు ఇరువురు దాదాపుగా 13 ఏళ్లపాటు సహజీవనం చేశారు. అయితే తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. గౌతమి.. కమల్ హాసన్ విడిపోయి దూరంగా ఉంటున్నారు. అయితే ఓ వార్తా సంస్థ మళ్లీ గౌతమి.. కమల్ హాసన్ ను కలవబోతున్నారని ఫేక్ న్యూస్ ప్రసారం చేసింది. దీనిపై ఆమె ఘాటుగా స్పందించారు.కమల్ తో మళ్లీ అనుబంధాన్ని కొనసాగించేది లేదని తేల్చి చెప్పారు. తాను ఆయన జీవితం నుంచి పక్కకు తప్పుకున్నానని తెలిపారు.

‘మూర్ఖులు నోటికొచ్చినట్లుగా మాట్లాడుతారు.. కుక్కలు మొరుగుతాయి.. నిజాల గురించి మాట్లాడాలి.. కమల్‌ హాసన్ తో మళ్లీ బంధాన్ని కొనసాగించేది లేదు. క‌మ‌ల్‌ హాసన్ జీవితం నుంచి పక్కకు తప్పుకున్నాను’ అని గౌతమి ట్వీట్ చేశారు.

Related Posts

leave a comment

Create Account



Log In Your Account