బాహుబలి తర్వాత ‘జై లవకుశ’ ట్రైలర్ దే హవా.. Video..

బాహుబలి తర్వాత ‘జై లవకుశ’ ట్రైలర్ దే హవా.. Video..

రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. అతి తక్కువ సమయంలో కోటి వ్యూస్ సాధించింది. ఆదివారం రిలీజ్ అయిన ఈ టీజర్ కేవలం 24 గంటల్లో 7.54 మిలియన్ల సాధించింది. ప్రెజెంట్.. అదికాస్తా కోటి వ్యూస్ దాటేసింది. గతంలో ‘బాహుబలి’ చిత్రం మాత్రమే అతి తక్కువ సమయంలో ఈ రేంజ్ లో వ్యూస్ సాధించింది. ఆ తర్వాత ఈ ఘనత ‘జై లవకుశ’ టీజర్ కు మాత్రమే దక్కింది.

అసలు ఈ రేంజ్ లో ట్రైలర్ దుమ్ము రేపడానికి కారణం ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ . ముఖ్యంగా జై క్యారెక్టర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ‘అసురుల చక్రవర్తి.. లంకాధిపతి.. ఈ రావణాసురుడు..’ అంటూ యంగ్ టైగర్ చెప్పిన డైలాగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అలాగే ‘ఘట్టమేదైనా.. పాత్రేదైనా.. నేను రె.. రె.. రెడీ’ అంటూ నత్తి నత్తిగా పలికిన డైలాగ్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. చివరిలో ఒరేయ్ రావణా.. అన్నప్పుడు జడుసుకోవడం.. సిట్యూవేషన్ కి తగ్గట్లుగా ఎన్టీఆర్ గట్టిగా నవ్వడం సూపర్బ్ అంటున్నారు నెటిజన్లు. ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఒక్క సినిమా ప్రముఖులే కాదు.. చాలామంది జై క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటనకి ఫిదా అయిపోతున్నారు.

ట్రైలర్ కి ఇంతలా ఆదరణ రావడం పట్ల ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తాను ఇంతకుముందు చెప్పినట్లుగానే తన నటనతో అభిమానులను ప్రేక్షకులను సంతృప్తి పరుస్తానని మరోసారి వెల్లడించారు. సెప్టెంబరు 21న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. రాశీకన్నా, నివేదితా థామస్ హీరోయిన్లుగా నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

ఇవి కూడా చదవండి :

‘సాహో’ మూవీలో మలయాళం స్టార్ హీరో..?

డేర్ అండ్ డాషింగ్ లేడీగా శ్రద్ధా కపూర్..?

సూపర్ స్టార్ వద్దు.. అభిమానుల ప్రేమ చాలు’

రజిని రోబో ‘2.0’ టీజర్, ట్రైలర్ ఎప్పుడో తెలుసా..?

ఇంతకీ ఈ లుక్ లో ఉన్నదెవరు..?

 

 

Related Posts

leave a comment

Create AccountLog In Your Account