‘మణికర్ణిక’లో యాక్షన్ సీన్లు ఎలా తీస్తున్నారో తెలుసా..?

‘మణికర్ణిక’లో యాక్షన్ సీన్లు ఎలా తీస్తున్నారో తెలుసా..?

బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టాలీవుడ్ ని షేక్ చేసింది. బాహుబలి చిత్రం తీయడానికి జక్కన్న ఎంత టైమ్ తీసుకున్నారో అందరికి తెలిసిందే. ఆ రేంజ్ లో కాకపోయినా ప్రేక్షకులకు నచ్చే విధంగా శాతకర్ణి తీసి సూపర్ అనిపించుకున్నాడు. రెగ్యులర్ సినిమాలతో పాటు.. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాలు తీయడంలో కూడా గుడ్ అనిపించుకున్నాడు.

ప్రెజెంట్ ఈ యంగ్ డైరెక్టర్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ అని ఓ మూవీ తీశాడు. కాని ప్రస్తుతం తీస్తున్న మూవీపై అందరి దృష్టి పడింది. ‘మణికర్ణిక’ పేరుతో ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రని సినిమాగా తీస్తున్నాడు. ఈ మూవీలో వార్ సీన్స్ ఫుల్ గా ఉంటాయి.

ఈ యాక్షన్ సీన్స్ పర్ఫెక్ట్ గా రావడానికి క్రిష్ గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని సమాచారం. హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్ నిక్ పావెల్ ని తీసుకొచ్చారు. ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తున్న కంగనా రనౌత్ కి పావెల్ అండర్ లో ట్రైనింగ్ ఇప్పించారు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు బాగా నేర్పించారట.

అలాగే హైదరాబాద్ నుంచి కొంతమంది ఫైటర్స్ ని తీసుకెళ్ళి వారికి కూడా ఫుల్ ట్రైనింగ్ ఇప్పించారట. అంతా పర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇంచుమించు అన్ని భాషల్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వచ్చాయి. కాకపోతే ఈ రేంజ్ లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ అని ఇండస్ట్రీ టాక్. ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account