మరో స్టార్ హీరో తనయుడి ఎంట్రీ కన్ఫర్మ్..!

మరో స్టార్ హీరో తనయుడి ఎంట్రీ కన్ఫర్మ్..!

స్టార్ హీరోల వారసులు తెరగేట్రం చేయడం కామన్ అయిపోయింది. ఇది గత రెండు మూడు తరాల నుంచి చూస్తూనే ఉన్నాం. హీరో వయసు మళ్లిన తర్వాతో లేకపోతే సినిమాల నుంచి తప్పుకునే మూమెంట్ దగ్గరలోనే ఉంది అనగానో జనరల్ గా వారి వారసులు ఎంట్రీ ఇస్తూంటారు. ప్రెజెంట్ ఇందులో కాస్తంత ఛేంజ్ వచ్చింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో ఆ ఛేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ ఛేంజ్ ఏంటి అంటారా..?

హీరోలు కెరీర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉండగానే వారి వారసులు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఆయా హీరోల చిన్నప్పటి క్యారెక్టర్లలో నటించి ఫేమస్ అవుతున్నారు.ఇలాగే ప్రిన్స్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మరో హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ కూడా నటించాడు. ఇప్పుడు ఇదే కోవలో మాస్ మహారాజా రవితేజ తనయుడు ఎంట్రీ ఇస్తున్నాడు.

నిజానికి గత వారం రోజులుగా రవితేజ కుమారుడు బాలనటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడని తెగ ప్రచారం సాగింది. చివరకు ఈ ప్రచారాలు కాస్తా నిజం అయిపోయాయి. రవితేజ లేటెస్ట్ మూవీ ‘రాజా ది గ్రేట్’. ఈ సినిమాలో హీరో చిన్నప్పటి క్యారెక్టర్ లో రవితేజ తనయుడు మహాధాన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేసేశాడు. అంతేకాదు ఈ జూనియర్ మాస్ మహారాజాతో ఓ దిగిన ఓ ఫొటోను కూడా రిలీజ్ చేశారు. ఈ పిక్ లో మహాధాన్ స్టిక్ పట్టుకుని కనిపిస్తున్నాడు. అంటే అంధుడిగానే ఎంట్రీ ఇస్తున్నాడన్నమాట. సో.. మహాధాన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పేయండి.

leave a comment

Create AccountLog In Your Account