మహేష్ బాబు ‘స్పైడర్’ ట్రైలర్..  డైలాగ్స్ సూపర్బ్.. Video..

మహేష్ బాబు ‘స్పైడర్’ ట్రైలర్.. డైలాగ్స్ సూపర్బ్.. Video..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’. ఈ సినిమాకి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. ఈ మూవీలో హీరోయిన్ గా అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఎస్ జే సూర్యా విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ మూవీతోనే మహేష్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

మహేష్ బాబు స్పై గా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ని శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ప్రిన్స్ చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ‘నేను స్పైడర్ మ్యానో.. సూపర్ మ్యానో కాదు. ఈ సొసైటీని ఛేంజ్ చేయడం లేదు’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

అలాగే మహేష్-రకుల్ మధ్య బస్ లో సాగే సంభాషణ నవ్వు తెప్పించక మానదు. ‘లైబ్రరిలో ఎలా మాట్లాడుకుంటాం’ అని మహేష్ అడిగితే.. ‘కిస్ కిస్ అని మాట్లాడుకుంటాం’ అని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతుంది. దీనికి మహేష్ స్మైలింగ్ ఫేస్ తో ‘సరే కిస్ కిస్ అని మాట్లాడుకుందాం’ అని అంటారు. ఈ సీన్ సరదగా అనిపిస్తుంది.ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account