మాస్ మహారాజాను మరోసారి శ్రీనువైట్ల డైరెక్ట్ చేస్తాడా..?

మాస్ మహారాజాను మరోసారి శ్రీనువైట్ల డైరెక్ట్ చేస్తాడా..?

వరుస విజయాలు అందుకున్న దర్శకుల్లో శ్రీను వైట్ల కూడా ఒకరు. అయితే కొద్దికాలంగా ఆయన్ను పరాజయాలే పలుకరించాయి. ఆయన దర్శకత్వం వహించిన ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’ వంటి చిత్రాలు యావరేజ్ టాక్ సంపాదించుకున్నాయి. దీంతో శ్రీనువైట్ల పేరు చెబితే హీరోలు పారిపోతున్నారని టాలీవుడ్ లో ప్రచారం సాగింది. ఇదిలాఉంటే.. ఈ మధ్యకాలంలో శ్రీనువైట్ల.. మాస్ మహారాజ రవితేజను కలిసి ఓ స్టోరీ చెప్పారట.

అదికాస్తా రవితేజకు బాగా కిక్ ఇచ్చిందట. దీంతో వెంటనే శ్రీనువైట్లకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారని ఫిల్మ్ నగర్ లో తెగ ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. గతంలో రవితేజ-శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి చిత్రాలు ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. కథ కూడా నచ్చడంతో పాటు .. దర్శకుడి టాలెంట్ గురించి కూడా ఆల్రెడీ తెలుసు కాబట్టి మాస్ మహారాజా మరేం ఆలోచించకుండా ఒకే చెప్పేశారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account