‘యుద్ధం శరణం’లో చైతూ డైలాగ్స్ కి ఫ్యాన్స్ ఫిదా.. Video..

‘యుద్ధం శరణం’లో చైతూ డైలాగ్స్ కి ఫ్యాన్స్ ఫిదా.. Video..

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూవీ ‘యుద్ధం శరణం’. ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ‘పరిగెత్తే ప్రతివాడూ పారిపోతున్నట్లు కాదు’ అని అక్కినేని నాగ చైతన్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి కృష్ణ ఆర్‌.వి.మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి చైతూ సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఆదివారం రాత్రి ఈ మూవీ ఆడియో ఫంక్షన్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘మన జీవితాలు ఆనందంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా అద్భుతంగానే అనిపిస్తుంది. అది మన ప్రపంచం. కానీ.. ఆ జీవితాల్ని కుదిపేస్తూ ఒక కట్‌ త్రోట్‌ క్రిమినల్‌’ అంటూ చైతూ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే విలన్ గా నటిస్తున్న శ్రీకాంత్ ‘ఎవడో ఆట మొదలుపెట్టాడు’ అని చెప్పే డైలాగ్ కూడా విలనిజాన్ని చూపిస్తోంది. ఈ మూవీని వారాహి చలన చిత్ర బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account