రజినికాంత్ ‘రోబో 2.0’ మేకింగ్ వీడియో రిలీజ్.. Video

రజినికాంత్ ‘రోబో 2.0’ మేకింగ్ వీడియో రిలీజ్.. Video

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన రోబో 2.0 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ వహించారు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వినాయక చవితి నేపథ్యంలో ఈ మూవీకి చెందిన వీడియో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ వీడియోని దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో షూటింగ్ ఎలా జరిగింది అనేది చూపించారు. రజిని, అక్షయ్ లకు మేకప్ వేయడం కనిపిస్తోంది. అలాగే అక్షయ్ కుమార్ విలన్ క్యారెక్టర్ షూటింగ్ కూడా చూపించారు. ఈ వీడియో రిలీజ్ తో రజిని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ మేకింగ్ వీడియో సినిమాపట్ల మరింత ఆశక్తిని కలిగిస్తోంది.

leave a comment

Create AccountLog In Your Account