రజిని రోబో ‘2.0’ టీజర్, ట్రైలర్ ఎప్పుడో తెలుసా..?

రజిని రోబో ‘2.0’ టీజర్, ట్రైలర్ ఎప్పుడో తెలుసా..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న మూవీ ‘2.0’.ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ మూవీ యూనిట్ బయటపెట్టింది. కొన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఈ మూవీ ఆడియో అక్టోబర్‌లో దుబాయ్‌లో ఆవిష్కరించనున్నామని తెలిపింది.

అలాగే టీజర్‌ను నవంబర్‌లో హైదరాబాద్‌లో రిలీజ్ చేస్తున్నామని తెలిపింది.ఇక ట్రైలర్‌ ను చెన్నైలో డిసెంబర్‌లో విడుదల చేయనున్నామని పేర్కొంది. చిత్ర ట్రైలర్ ని రజిని బర్త్ డే సందర్భంగా విడుదల చేయనున్నారు. అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account