రవితేజ  ‘రాజా ది గ్రేట్’ టైటిల్ సాంగ్.. Video

రవితేజ ‘రాజా ది గ్రేట్’ టైటిల్ సాంగ్.. Video

సింధూరం మూవీలో చిన్న క్యారెక్టర్ తో రవితేజ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుసగా హీరోగా అవకాశాలు వచ్చాయి. రవితేజ యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే జనానికి బాగా నచ్చేసింది. ఇక చేసిన సినిమాలు హిట్ కావడంతో స్టార్ డమ్ వచ్చేసింది. అలా అలా జనానికి బాగా కనెక్ట్ అయిపోయి మాస్ మహారాజా అయిపోయాడు.

అయితే ఈ హీరోగారికి ఈ మధ్య వరుసగా ప్లాప్ లే ఎదురయ్యాయి. నిజానికి రెండు సినిమాలు ప్లాప్ అయినా థర్డ్ మూవీతో హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాని ఈ సారి సీన్ రివర్స్ అయింది. ఏమన్నుకున్నారో ఏమో గాని కాస్తంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రెజెంట్ ‘రాజా ది గ్రేట్’ మూవీలో నటిస్తున్నాడు.

ఇక తన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ బ్లైండ్ మేన్ గా కనిపించనున్నాడు. బ్లైండ్ క్యారెక్టర్ కి తనదైన శైలిలో మాస్ యాక్షన్ జోడించి ఈ సినిమా చేసేస్తున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా పనిచేస్తున్నాడు. చిత్ర యూనిట్ ఈ మూవీకి చెందిన ఓ సాంగ్ ని రిలీజ్ చేసింది.

ఈ టైటిల్ సాంగ్ ని సాయి కార్తీక్ కంపోజ్ చేశాడు.’రాజా రాజా రాజా ది గ్రేటురా.. నువ్వు తళతళా టూ తౌజెండ్ నోటురా’ అంటూ పాట సాగింది. మధ్యలో నువ్వు కళ్ళు లేనోడివి అని ఎవరో అంటే.. ‘నోర్మూయ్ ఆ టాపిక్ లేకుండా పాడలేవా ?’ అంటూ రవితేజ వాయిస్ వినిపిస్తుంది. శ్యామ్ కాసర్ల రాసిన పాటని రవితేజ, రేవంత్, సాకేత్ పాడగా.. సాయి కార్తీక్ మంచి బాణీని ఇచ్చాడు.ఈ టైటిల్ సాంగ్ తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుందని అర్ధమవుతోంది. ‘రాజా ది గ్రేట్’ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account