‘రాజా ది గ్రేట్’ తో రవితేజ తనయుడు ఎంట్రీ..?

‘రాజా ది గ్రేట్’ తో రవితేజ తనయుడు ఎంట్రీ..?

హీరో రవితేజ తనయుడు మహాధన్ బాలనటుడిగా పరిచయం కాబోతున్నారని టాక్. రవితేజ తాజాగా చిత్రం’ రాజా ది గ్రేట్’. ఈ చిత్రంలో ఆయన అంధుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ మూవీలో రవితేజ చిన్ననాటి పాత్రలో మహాధన్ కనిపించనున్నాడట. ఈ పాత్ర కోసం పలువురిని చిత్ర యూనిట్ సంప్రదించింది. చివరకు రవితేజ తనయుడు అయితే బాగుంటుందని భావించారట. మరి జూనియర్ మాస్ మహారాజా ఎంట్రీ ఎంత వరకు నిజమో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account