‘సాహో’ మూవీలో మలయాళం స్టార్  హీరో..?

‘సాహో’ మూవీలో మలయాళం స్టార్ హీరో..?

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘సాహో’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అలాగే డబ్ చేసి మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ని తీసుకున్నారు. బాలీవుడ్ కి చెందిన ఇతర నటులు జాకీష్రాఫ్ , చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేశ్, టినూ ఆనంద్, మందిరా బేడీలను కూడా ఎంపిక చేశారు.

మలయాళంలో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కాబట్టి ఆ ఇండస్ట్రీని నుంచి కూడా తీసుకోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే మోహన్ లాల్ అయితే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారని టాక్. జగపతి బాబు కూడా మన్యంపులితో మలయాళంలో ఫేమస్ అయ్యారు. ఆయన్ను కూడా తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే వీరిద్దరి నుంచి ఇంకా క్లారిటి రాలేదని సమాచారం. మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలోకి ఎంట్రీ ఇస్తే మలయాళంలో సినిమా ఓపెనింగ్స్ బాగుంటాయని దర్శక నిర్మాతల ఆలోచనగా ప్రచారం సాగుతోంది.

Related Posts

leave a comment

Create Account



Log In Your Account