‘సాహో’ లో నెగెటివ్ క్యారెక్టర్ లో మందిరా బేడీ..?

‘సాహో’ లో నెగెటివ్ క్యారెక్టర్ లో మందిరా బేడీ..?

ప్రభాస్-సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘సాహో’. ఈ చిత్రాన్ని ఏకంగా రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని జాతీయస్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘సాహో’ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తీస్తున్నారు. ఇతర భాషల్లో అనువదించి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇలా మళయాలం, కన్నడలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్.

జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం కాబట్టి కొందరు బాలీవుడ్ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ను తీసుకున్నారు. అలాగే కీలక పాత్రల కోసం జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, టినూ ఆనంద్ లను ఎంపిక చేసుకున్నారు. ఓ ప్రత్యేక పాత్ర కోసం మందిరా బేడీని కూడా సెలెక్ట్ చేసుకున్నారని టాక్. ఈ పాత్రకు నెగెటివ్ టచ్ ఉంటుందని సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇదిలాఉంటే ‘బాహుబలి’ తర్వాత రెబెల్ స్టార్ చేస్తున్న ‘సాహో’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ టీజర్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account