సినీ ప్రముఖుల గణేష్ చతుర్ధి..

సినీ ప్రముఖుల గణేష్ చతుర్ధి..

దేశవ్యాప్తంగా ప్రజలు శ్రద్ధా భక్తులతో వినాయక చవితి పండుగను జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజలు తమతమ నివాసాల్లో వినాయక చవితి వ్రతం ఆచరించారు. అలాగే దేవాలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. పలు చోట్ల వీధుల్లో గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ ఆథ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఇక సినీ ప్రముఖులు కూడా పండుగను జరుపుకున్నారు. తమతమ నివాసాల్లో విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సినీ ప్రముఖులు అభిమానులతో పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సినీ నటులు అక్కినేని నాగార్జున , చిరంజీవి తాము తీసిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు.

 

Related Posts

leave a comment

Create AccountLog In Your Account