‘సైరా’లో చిరంజీవికి గురువుగా నటించనున్న అమితాబ్..?

‘సైరా’లో చిరంజీవికి గురువుగా నటించనున్న అమితాబ్..?

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’తో భారీ హిట్ కొట్టారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో 151వ చిత్రానికి విభిన్నమైన స్టోరీని ఎంచుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నారు. ఈ మూవీలో లీడ్ రోల్ చిరు కనిపించనున్నారు. ఇటీవలె ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి విశేషంగా ఆదరణ లభిస్తోంది.

ఇదిలాఉంటే ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించనున్నారని ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కెర్లు కొడుతోంది. బలమైన పాత్ర అయితే తప్ప అమితాబ్ ఒప్పుకునే అవకాశం ఉండదు. అందువల్ల ఆయనది ఎంతో పవర్ ఫుల్ క్యారెక్టర్ అయిఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు.. అమితాబ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో నటించనున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Related Posts

leave a comment

Create AccountLog In Your Account