‘స్పైడర్’ మూవీ రివ్వ్యూ

‘స్పైడర్’ మూవీ రివ్వ్యూ

మూవీ: స్పైడర్‌
యాక్టర్స్: మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ఎస్‌.జె.సూర్య, భరత్‌
బ్యానర్‌: ఎన్‌వీఆర్‌ సినిమా ఎల్‌ఎల్‌పీ, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
ప్రొడ్యూసర్స్: ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు
మ్యూజిక్: హారిస్‌ జైరాజ్‌
కెమెరా: సంతోష్‌ శివన్‌
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
రచన, డైరెక్షన్: ఏఆర్‌ మురుగదాస్‌
రిలీజ్ డేట్: 27-09-2017

మహేష్ బాబు అంటే స్టైలిష్ హీరో అనే పేరుంది. ఆయన్ను తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీ తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతుందని తెలియడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. గతంలో మురుగదాస్ గజిని, తుపాకి వంటి హిట్ చిత్రాలు అందించారు. దీంతో మహేష్ తో ఎలాంటి సినిమా తీస్తున్నారో అన్న ఉత్కంఠ క్రియేట్ అయింది. స్పై క్యారెక్టర్ అని తెలిసేసరికి అంచనాలు పీక్ స్టేజ్ కి చేరాయి. మరి మహేష్ సినిమాలో ప్రేక్షకులు ఊహింతనంత స్టైలిష్ గా కనిపించారా..? విలన్ గా ఎస్ జే సూర్యా ఎలా నటించారు..? అసలు ఈ మూవీ ఎలా ఉంది..? వంటివి ఓ సారి పరిశీలిద్దాం..

స్టోరీ:

శివ (మ‌హేశ్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరో అధికారిగా ప‌నిచేస్తుంటాడు. అతనికి షూటింగ్‌ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినప్పటికి త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని పలువురిని కాపాడ‌ుతూ ఉంటాడు. అందులోనే ఆత్మసంతృప్తి ఉంద‌ని న‌మ్ముతాడు. తనకు అలెర్ట్స్ అందించే పలు రకాల సాఫ్ట్ వేర్స్ రూపొందించుకుంటాడు. అన్ని రకాల ఫోన్స్ నుంచి కొన్ని రకాల పదాలు వినిపిస్తే తనకు అలర్ట్ వచ్చేలా తన సాఫ్ట్ వేర్స్ ని రెడీ చేసుకుంటాడు. ఇలా శివ పలువురి కాపాడుతూ ఉంటాడు. ఓ సారి శివకు సాయం చేయబోయి అతని ఫ్రెండ్ చనిపోతుంది. దీనికి కారణం ఎవరు అనే దానిపై ఆరా తీస్తాడు. అప్పడు భైరవుడు (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని త‌మ్ముడు (భ‌ర‌త్‌) గురించి చాలా విష‌యాలు తెలుస్తాయి. వీరిద్దరూ సైకో బ్రదర్స్ లాంటి వారు. ఎదుటి వారి ఏడుపు వీరికి ఆనందంగా అనిపిస్తుంది. ఎదుటివారిని బాధపెట్టేందుకు ఎంతకైనా తెగిస్తారు. అసలు ఈ బ్రదర్స్ ఎవరు..? వారు సైకోల్లా ఎందుకు బాధపెడుతూంటారు..? వారి ఆటలను శివ ఎలా కట్టిస్తాడు..? శివకు చార్లీ( రకుల్ ప్రీత్ సింగ్ ) కి మధ్య రిలేషన్ ఏంటి..? వంటి విషయాలను తెరమీద చూస్తేనే బాగుంటుంది.

విశ్లేషణ:

మ‌హేష్ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. ఫుల్ ఎనర్జిటిక్ గా , క్యూట్ గా కనిపిస్తాడు. ఓ స్పై క్యారెక్టర్ కి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో సేమ్ టు సేమ్ మహేష్ అలాగే ఉంటాడు. విల‌న్‌ తో క్లైమాక్స్ ముందు జ‌రిగే సంభాష‌ణ బాగుంటుంది. అలాగే విల‌న్‌ను పోలీసులకు లేడీస్ ప‌ట్టించే సీన్ లో కూడా మ‌హేష్ బాబు యాక్టింగ్ బాగుంటుంది. అయితే హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా పెర్ఫార్మెన్స్ చేసే స్కోప్ లేదు. కేవలం పాటలకు మాత్రమే పరిమితం అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక విలన్ గా నటించిన ఎస్ జే సూర్యా యాక్టింగ్ చాలా బాగుటుంది. ఇక భరత్ తన పరిధి మేరకు నటించాడు. అలాగే జయ ప్రకాష్, షియాజీ షిండే, ప్రియదర్శి, ఆర్.జె. బాలాజీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ముఖ్యంగా కథలో ఏ మాత్రం బలం లేదు. ఎస్ పీ డీ అనే ఓ సైకిక్ ప్రాబ్లమ్ బేస్ మీద స్టోరీని రెడీ చేసుకున్నాడు దర్శకుడు మురుగ దాస్. కాని అది ప్రెజెంటేషన్ లో వర్కవుట్ కాలేదు. వాస్తవానికి ఇలాంటి స్టోరీని మురుగదాస్ లాంటి దర్శకుడి నుంచి ఊహించలేం. కెమెరా మెన్ సంతోష్ శివన్ పనితనం బాగుంటుంది. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. నిర్మాణ విలువలు బాగుంటాయి. ఓవరాల్ గా సినిమా మొత్తం మహేష్ బాబు మీద బేస్ అయిపోయింది. ఆయనే ఈ మూవీని తన భుజాల మీద లాక్కెల్లాలి.

ప్లస్ పాయింట్స్:

మహేష్ బాబు యాక్టింగ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ప్రీ క్లైమాక్స్ సీన్
రోలర్ కోస్టర్ ఫైట్ సీన్
సినిమాటో గ్రఫీ

మైనస్ పాయింట్స్:

స్టోరీ వీక్ గా ఉండటం..
ప్రేక్షకులు సినిమాలో లీనం కాలేరు
సాంగ్స్

బోటమ్ లైన్: సైకో వేటలో ‘స్పైడర్’

రేటింగ్: 2.25/5

 

 

leave a comment

Create AccountLog In Your Account