Power Star Surprise Gift to fans

Power Star Surprise Gift to fans

ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పవర్ స్టార్..!

పవన్ కల్యాణ్ తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశారు. సెప్టెంబర్ 2 బర్త్ డే సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ పవన్ కు 25వ చిత్రం అవుతుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ లో పవన్ క్యూట్ గా కనిపిస్తున్నారు. అయితే సినిమా టైటిల్ ని మాత్రం విడుదల చేయలేదు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.తాజా చిత్రం వీరి కాంబినేషన్ లో మూడవ చిత్రం అవుతుంది. గత చిత్రాల మాదిరిగా ఈ మూవీ కూడా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ తాజా చిత్రంపై చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇంజినీరు బాబు, గోకుల కృష్ణుడు, దేవుడు దిగివచ్చిన వేళ, రాజు వచ్చినాడు వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ప్రచారం సాగింది. అయితే ఇప్పటివరకు టైటిల్ మాత్రం అనౌన్స్ చేయలేదు. మరి త్వరలోనే టైటిల్ కూడా కన్ఫర్మ్ అవుతుందేమో చూద్దాం..

Related Posts

leave a comment

Create Account



Log In Your Account